గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం వీరవల్లి వద్ద విజయవాడ - ఏలూరు జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రికి తరలించినట్లు వీరవల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.