బాపులపాడు మండలం సిరివాడ గ్రామంలో మేరీ ప్లారిన్స్ (60) అనే మహిళ కిరాతకంగా బుధవారం హత్య గావించబడింది. ఈ హత్య చేసింది హనుమాన్ జంక్షన్ ఇందిరానగర్ కు చెందిన యువకునిగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారం కారణమని, ప్రేమకు అడ్డుగా వస్తుందన్న ఉద్దేశంతో హత్యకు చేసినట్టు తెలుస్తోంది. వీరవల్లి పోలీస్ సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు.