కృష్ణా జిల్లా గన్నవరంలోని సినిమాలు సెంటర్ లో బుధవారం రైతులు హైవే ను దిగ్భంగం చేశారు. దీనికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ట్రాఫిక్ సిబ్బంది వరిగెడ్డి ట్రాక్టర్లు అనుమతించపోవడం గురించి అడిగిన రైతులపై ట్రాఫిక్ కానిస్టేబుల్ దురుసుగా మాట్లాడటంతో ఆగ్రహం చెందిన రైతులు క్షమాపణ చెప్పి తీరాలంటూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ కిలోమీటర్ నిలిచిపోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.