టీవీ డిబేట్లో మహిళలను విమర్శించడం వైసీపీ నాయకుల అసలైన నీచ రాజకీయమని తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి కళ్యాణి మండిపడ్డారు. అమరావతి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యలు ఉన్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గన్నవరం టీడీపీ కార్యాలయం నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.