గన్నవరంలో రోడ్డు ప్రమాదం

గన్నవరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం విద్యానగర్ స్టేట్ బ్యాంక్ వద్ద రోడ్డు దాటుతున్న ముగ్గురిని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారు హైదరాబాద్‌కు చెందిన వారని గుర్తించారు. చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్