బాపులపాడు మండలం బండారుగూడెం గ్రామంలో డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతిని బుధవారం దాసి అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వడ్లమూడి తిరుపతిరావు, పరిమి రాకేష్, పామర్తి రాంబాబు, షాడో పామర్తి కిరణ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైయస్సార్ కు ఘనంగా నివాళులర్పించారు.