భవన నిర్మాణ కార్మికుల ధర్నా: న్యాయమైన డిమాండ్ల సాధనకు లేబర్ ఆఫీస్ వద్ద నిరసన

గుడివాడలో భవన నిర్మాణ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సోమవారం లేబర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. గత ఏడేళ్లుగా క్లెయిమ్స్ మంజూరు కాక ఇబ్బందులు పడుతున్నామని, కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానాలను రద్దుచేసి పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని సంఘం నాయకులు రేపాని కొండ తెలిపారు. కార్మిక సంక్షేమ నిధులను సక్రమంగా వినియోగించి పెండింగ్ క్లెయిమ్స్ ను వెంటనే మంజూరు చేయాలని కోరుతూ లేబర్ ఆఫీసర్ కు వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్