గుడివాడలోని కే కన్వెన్షన్లో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు "బాబు షూరిటీ–మోసం గ్యారంటీ" పేరుతో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్టు వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను శుక్రవారం తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని పిలిపునిచ్చారు.