గుడివాడ: చిన్నారి తలపైకి కారు ఎక్కించిన ఓనర్

గుడివాడ రాజేంద్రనగర్ పార్క్ సమీపంలో ఆదివారం 7వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థినిపై కారు దూసుకెళ్లింది. తలపై కారు ఎక్కడంతో చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. సంఘటనా స్థలం నుండి కారు యజమాని పరారయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి బాలికను సంజీవని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు కారు డ్రైవర్‌ను గుర్తించి ఆసుపత్రికి తీసుకురాగా, చిన్నారి వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానని అతను తెలిపాడు.

సంబంధిత పోస్ట్