పేకాట శిబిరంపై గురువారం పోలీసులు దాడి చేసి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. గుడివాడ చెంచుపేటలోని బహిరంగ ప్రదేశంలో పేకాట ఆడుతున్నట్లు గుడివాడ 1వ పట్టణ పోలీసులకి రాబడిన విశ్వసనీయ సమాచారంపై జిల్లా ఎస్ పి గంగాధర్ రావు, గుడివాడ ఇన్చార్జి డిఎస్పి అబ్ధుల్ సుభని ఆదేశాలు మేరకు గుడివాడ 1వ పట్టణ టౌన్ సిఐ తన సిబ్బందితో రైడ్ చేసి 10 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 5400 నగదు స్వాధీనం చేసుకున్నారు.