గుడివాడ-విజయవాడ ప్రధాన రహదారిలోని డీమార్ట్ సమీపంలో శుక్రవారం బైక్, స్కూటీ ఢీకొని ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్కూటీపై వస్తున్న యువకుడు రోడ్డుకు ఎడమ పక్కగా వస్తుండగా బైక్ పై వెళుతున్న ఇద్దరు యువకులు రాంగ్ రూట్లో ఎదురుగా వచ్చి ఢీకొన్నారు. దీంతో బైక్పై ఉన్న ఓ యువకుడి కాలు విరిగింది. స్కూటీపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.