జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ గ్రామంలో పట్టపగలే చోరీ జరిగిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. దొంగలు ఇంట్లో రెండు లక్షల యాభై వేల రూపాయలు దొంగిలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.