జగ్గయ్యపేట మండలం గరికపాడులోని డాక్టర్ కె. ఎల్. రావు కృషి విజ్ఞాన కేంద్రంలో కూరగాయలలో విలువ ఆధారిత శిక్షణ కార్యక్రమం పూర్తయిన సందర్భంగా బుధవారం సర్టిఫికెట్లను గ్రామీణ మహిళలకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి మహిళల నుంచి అభిప్రాయం సేకరించి భవిష్యత్తులో శిక్షణ కార్యక్రమాలను ఇంకా మెరుగ్గా అందిస్తామని ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ కృష్ణంరాజు తెలిపారు.