జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య విలియంపేటలో పర్యటించారు.శనివారం జగ్గయ్యపేట 14వ వార్డు విలియంపేటలో అధికారులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య వార్డులో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని వాటికి పరిష్కార మార్గం చూపించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు, కమిషనర్ రామ్మోహన్, కౌన్సిలర్ నకిరేకంటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.