పెనుగంచిప్రోలులో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమయింది. పెనుగంచిప్రోలు నుండి సింగవరం వెళ్లే రహదారి పక్కన బావిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు స్థానికులు తెలిపారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు అన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.