ఏరువాక పౌర్ణమి సందర్భంగా సోమవారం పెనుగంచిప్రోలులోని శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లను పల్లకిపై ఊరేగించి, మేళతాళాల మధ్య గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. రాత్రి 8 గంటలకు స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.