బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభానుని ఊరు బయటే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంఘటన బుధవారం జరిగింది. జగ్గయ్యపేట మండలం బుదవాడ గ్రామంలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ నందు జరిగిన సంఘటనలో మరణించిన, గాయపడిన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బుధవారం బుదవాడ వెళ్ళిన మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభానుని ఊరు బయటే పట్టుకున్నారు.