వత్సవాయి మండలం గురువారం నాడు రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, పొలంపల్లి కి చెందిన రంగా రాజేశ్వరి, టూ వీలర్ వెళుతున్న సమయంలో లారీ ఢీ కొట్టిందన్నారు. అమాంతం లారీ మీదకు ఎక్కి వెళ్ళింది అన్నారు. ఘటనా స్థలంలోనే మహిళ మృతి చెందింది అన్నారు. మహిళకు 2ఏళ్ల చిన్నారి వుంది, పైగా 7నెలల గర్భవతి అని తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.