కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చిన్న గొల్లపాలెం చెరువులో శనివారం అదృశ్యమైన మామ, అల్లుడి మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. బైకుకు తాళ్లతో కట్టి ఉన్న ఈ మృతదేహాలను గ్రామస్థుల సహాయంతో పోలీసులు వెలికితీశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.