బంగారం దొంగిలించిన కేసులో దంపతులు అరెస్ట్

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆర్థిక సాయం అడిగేందుకు వెళ్లి, ఇంట్లో ఎవరూ లేరని గ్రహించి బీరువా పగలగొట్టి బంగారు ఆభరణాలు దొంగిలించిన చుక్క వీరబాబు, శ్రీలత దంపతులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వీరితో పాటు చుక్క వెంకటేశ్వరరావును కూడా అరెస్ట్ చేశారు. గాంధీనగర్లో నివాసముంటున్న జయరాజ్ ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుల నుంచి 96 గ్రాముల బంగారాన్ని రికవరీ చేసినట్లు DSP తెలిపారు.

సంబంధిత పోస్ట్