మచిలీపట్నం: 25 కిలోల గంజాయి స్వాధీనం

మచిలీపట్నం చిలకలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ నబి శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 25. 62 కిలోల గంజాయిని, ఐదుగురు ముద్దాయిలను పట్టుకున్నట్టు సి. ఐ అబ్దుల్ నబీ తెలియపరిచారు. మాచవరం మెట్టు దగ్గర తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా, ఆ సమయంలో గంజాయి విక్రయిస్తున్న బలంగా నాగరాజు మరియు నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారన్నారు. వారి వద్ద నుండి 25. 62 గంజాయి, 6000 నగదు స్వాధీనం చేసినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్