మచిలీపట్నం ఆర్. పేట పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నానిపై టీడీపీ నేతలు శనివారం ఫిర్యాదు చేశారు. రెండు, మూడు రోజులుగా వైసీపీ కార్యకర్తల సమావేశాల్లో ఆయన హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేస్తున్నారని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే చర్యలు చేపట్టాలని టిడిపి నేతలు డిమాండ్ చేశారు.