మచిలీపట్నంలో ఆదివారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిలిచి ఉండడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి ఎండ తీవ్రతతో అల్లాడిన ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం లభించింది. వేసవి తాపాన్ని తాళలేక వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, వర్షం పడటంతో ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించినట్లయింది.