మచిలీపట్నం: రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

మచిలీపట్నంలోని లక్ష్మీ టాకీస్ సెంటర్ వద్ద ఎస్బీఐ బ్యాంక్ సమీపంలో ఆదివారం రెండు టూ-వీలర్ వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శుక్రలాబాద్ కు చెందిన ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ లో గాయపడిన వ్యక్తిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్