ఆరేళ్ళ చిన్నారినికి బైక్ తో 11 సంవత్సరాల బాలుడు ఢీ కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మంగళవారం 12 గంటల సమయంలో 11 సంవత్సరాల మైనర్ బాలుడు ద్విచక్ర వాహనంతో భాష్యం స్కూల్ వద్ద రోడ్డు దాటుతున్న 6 సంవత్సరాలు చిన్నారిని అతివేగంతో గుద్దడం జరిగింది. చిన్నారి గాయాలు కావటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మైనర్ బాలుడికి వాహనం ఇవ్వడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.