మచిలీపట్నం: పోర్టు నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

నిర్ణీత సమయానికి మచిలీపట్నం పోర్టు సిద్ధం చేసేందుకు అందుకు సంబంధించిన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి మచిలీపట్నం పోర్టు, గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి పనులకు సంబంధించిన భూసేకరణ, ఇతర అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్