మచిలీపట్నం: రైతు బజార్ ల ద్వారా రూ. 40లకే టమోటాలు

రైతు బజార్ ల ద్వారా నాణ్యమైన టమోటాలు కేజీ రూ. 40లకు అందిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మార్కెటింగ్ కమిషనర్ ఎం. విజయ సునీత తెలిపారు. శనివారం మచిలీపట్నంలో ఆమె మాట్లాడుతూ మార్కెట్లో టమోటా ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలకి అందుబాటులో తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు తక్కువ ధరలకు అందిస్తున్నట్టు తెలిపారు

సంబంధిత పోస్ట్