మచిలీపట్నం: బందరును బంగారు బందరుగా మారుస్తా: మంత్రి

బందరును బంగారు బందరుగా మారుస్తానని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం మంత్రి ఆధ్వర్యంలో మచిలీపట్నంలో "బంగారు బందరు" కార్యక్రమం నిర్వహించారు. పలు ప్రాంతాల్లో చీపుర్లు పట్టి శ్రమదానం చేశారు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకర జీవనం సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, బందరు నియోజకవర్గ రూపు రేఖలు మార్చి చూపిస్తానన్నారు.

సంబంధిత పోస్ట్