బుధవారం ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) అధికారులు తెలిపారు. అలాగే పొరుగున ఉన్న గుంటూరు జిల్లాలో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక జూలై 3 నాటికి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.