కృష్ణా జిల్లా ఎస్పీగా గంగాధరరావు బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా మచిలీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లను సందర్శించారు. ఆర్ పేట, బందరు తాలూకా పోలీస్ స్టేషన్లను బందరు డీఎస్పీ అబ్దుల్ సుభాన్ తో కలిసి గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులను అడిగి తెలుసుకొని పరిశీలించారు.