ఇబ్రహీంపట్నం: మద్యం బాటిల్స్ తో వెళ్తున్న బోలెరో వాహనం బోల్తా పడిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఖిల్లా రోడ్డు ఎదురుగా అదుపు తప్పి బోలెరో వాహనం పడినట్లు స్థానికులు తెలిపారు. గొల్లపూడి మద్యం గోదాం నుంచి లోడ్ చేసుకొని కంచికచర్ల వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నామన్నారు. కొంతమేర నష్టం జరిగినట్లు తెలిపారు.