ఇబ్రహీంపట్నం: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయూ

కొండపల్లి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం సీఐటీయూ ధర్నా నిర్వహించింది. సీఐటీయూ ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి యం మహేష్ మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 26, 000 ఇవ్వాలన్నారు. నందిగామ అధ్యక్షులు బి. అప్పారావు, కార్యదర్శి జి. సురేష్ , ఉపాధ్యక్షులు దేవుళ్ళు, రమణ, సూరి బాబు, సహాయ కార్యదర్శిలు కృష్ణ, నవీన్, లక్ష్మణ రావు, రాజు ఉన్నారు.

సంబంధిత పోస్ట్