ఇబ్రహీంపట్నం: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

గురువారం ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద కృష్ణా నదిలో సుమారు 35-40 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. నీటిలో ఉబ్బిపోయి ఉండటంతో మృతదేహాన్ని గుర్తించడం కష్టంగా మారిందని పోలీసులు తెలిపారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయవాడ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్