ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘరానా మోసం జరిగింది. ఇబ్రహీంపట్నం లో నివాసముంటున్న వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి సంబంధించిన క్రెడిట్ కార్డు లోని 1, 45, 000 మాయమయ్యాయి. కార్డు తన దగ్గర ఉండగానే ఏమి కొనుగోలు చేయకుండానే, క్రెడిట్ కార్డ్ లో ఉన్న డబ్బులు మాయమవడంతో ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులు బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎవరెవరు వెళ్లాయి అనే కోణంలో దర్యాప్ చేస్తున్నారు.