కొండపల్లి మున్సిపాలిటీ 24వ డివిజన్‌లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులు మాట్లాడుతూ నెలకు నాలుగు వేలు పెన్షన్ తో జీవితం ప్రశాంతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, కమిషనర్ రమ్య కీర్తన, కౌన్సిలర్లు, అధికారులతో పాటు టీడీపీ, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.