ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి సిఏ కన్వెన్షన్ హాల్ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుండి ఇబ్రహీంపట్నం వస్తున్న కారును లారీ వెనక నుండి ఢీ కొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ కు తృటిలో ప్రమాదం తప్పింది. అతివేగంగా ప్రయాణించడంతో బ్రేకు పడకపోవడంతో ఆగి ఉన్న కారును ఢీకొట్టాడు.