మైలవరం మండలం పొందుగల సరిహద్దులోని ఎర్ర చెరువుపై కొంత మంది కన్ను పడింది. మూడు జేసీపీల ద్వారా చెరువులోని మట్టిని పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. చెరువు కరకట్ట పనుల ముసుగులో నిర్వాహకులు మట్టిని అక్రమంగా బయటకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని స్థానిక ప్రజలు ఆరోపించారు. రహదారులపై అతి వేగంగా ప్రయాణిస్తూ వాహనదారులను భయభ్రాంతులకు గురి చేశాయని అన్నారు. కాగా స్థానిక వీఆర్వోని వివరణ అడగగా మాకు తెలియదు మా దృష్టికి తీసుకురాలేదని వారు తెలిపారు.