మైలవరం: వృద్ధురాలిని ఢీకొట్టిన వాహనం

ఇబ్రహీంపట్నం (మం) కేతనకొండ వద్ద శనివారం గుర్తుతెలియని వాహనం ఓ వృద్ధురాలిని ఢీకొట్టింది. విజయవాడ నుంచి నందిగామ వైపుకు నడుచుకుంటూ వస్తున్న వృద్ధురాలిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలైందని స్థానికులు తెలిపారు. వెంటనే ఆమెను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్