ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో కేతనకొండ గ్రామం వద్ద టైర్ల కంపెనీ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్కూటీపై వెళుతున్న వ్యక్తి కుక్కను తప్పించబోయి అదుపు తప్పి కింద పడిపోయాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నుండి విజయవాడ వస్తున్న లారీ స్కూటీ మీద వెళుతున్న వ్యక్తిని ఢీకొంది. స్కూటీపై వెళ్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.