మైలవరంలో రోడ్డు ప్రమాద ఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నూజివీడు రోడ్డు బైపాస్ హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టింది. దీంతో ద్విచక్ర వాహన దారుడికి స్వల్ప గాయాలు తగిలయాన్నారు. స్థానికులు గమనించి క్షతగాత్రుడిని మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.