ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మహిళ హత్య కేసులో పోలీసులు మిస్టరీని ఛేదించారు. మృతురాలిని మంగళగిరికి చెందిన కళ్యాణిగా గుర్తించారు. ఆమెను భవానిపురానికి చెందిన షఫి హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కళ్యాణితో షఫికి వివాహేతర సంబంధం ఉందని, కొన్నళ్ల క్రితం కళ్యాణి తన కుమారుడిని షఫికి ఇవ్వగా, కుమారుడి విషయంలో వారిద్దరి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. తన కుమారుడిని తనకు అప్పగించాలని కళ్యాణి ఒత్తిడి తేవడం, పదే పదే గొడవపడటమే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు షఫిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.