ఇబ్రహీంపట్నం ఎ. కాలనీ వద్ద బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఉన్న గుంత కారణంగా ముందు వెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్ వేసింది. దీంతో వెనుక వస్తున్న టిప్పర్ లారీ అదుపుతప్పి డివైడర్ రైలింగ్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ ముందు భాగం ధ్వంసమైంది. కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అయితే ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు.