మైలవరంలో గురువారం దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మైలవరం మారుతి నగర్లో గదిలో ఒక బాబు పాప మృతి చెందారాన్నారు. ఈ ఘటన 4రోజుల క్రితమే జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చుట్టూ పక్కల వారికి దుర్వాసన రావటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.