రెడ్డిగూడెంలో అన్నేరావుపేటలో ట్రాక్టర్ బోల్తా కొట్టి బాణావతి కుమారి (30)అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదంలో గాయపడిన గోపాల్ అనే వ్యక్తిని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మామిడి కోతకు వెళుతుండగా ట్రాక్టర్ ప్రమాదవశాత్తు పల్టీ కొట్టింది. మృతి చెందిన కుమారిని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి పంచనామా నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరావు తెలిపారు.