జాపూడి సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆటో బైక్ ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.