బుధవారం సాయంత్రం విజయవాడలోని నందిగామ, అయోధ్య నగర్, సత్యనారాయణపురం, అజిత్ సింగ్ నగర్, పాయికాపురం, కండ్రిక, రాజీవ్ నగర్ వంటి పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కారణంగా చిరు వ్యాపారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే, ఎండల వేడిమితో అల్లాడిపోతున్న నగరవాసులకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని కలిగించింది.