కంచికచర్ల: స్కూటీ, కారు ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

కంచికచర్ల మండలం పేరకలపాడు వద్ద జాతీయ రహదారిపై బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పేరకలపాడుకు చెందిన ఏసుపోగు పుల్లారావు కంచికచర్ల నుంచి పేరకలపాడుకు వెళ్తున్న క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కారు పుల్లారావు స్కూటీని ఢీకొంది. ఈ ఘటనలో పుల్లారావుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్