కంచికచర్ల మండలం పరిటాల గ్రామం వద్ద బుధవారం సాయంత్రం కూలీల ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలు అయ్యాయి. తీవ్ర గాయలైన ఇద్దరినీ విజయవాడ ఆస్పత్రికి తరలించగా, మిగిలిన ఐదుగురిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామానికి చెందిన వారీగా గుర్తించారు. కంచికచర్ల పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.