కంచికచర్లలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన మంగళవారం కంచికచర్ల వద్ద పెద్ద బ్రిడ్జి మునేటిలో జరిగింది.  మరియని వాసు స్కూల్లో 6వ తరగతి చదువుతున్న శివారెడ్డి మరణించిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. నలుగురు విద్యార్థులు మునేటిలో ఈతకు దిగినట్లుగా సమాచారం. అందులో ముగ్గురు క్షేమంగా బయటికి రాగా శివారెడ్డి నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందినట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్