నందిగామ పట్టణ పరిధిలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి భారీ వర్షం కురిసింది. కురిసిన అకాల వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఉదయం నుంచి ఓ మోస్తారుగా ఉష్ణోగ్రత పెరిగినప్పటికీ సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి భారీ వర్షం కురిసింది. దీంతో మొక్కజొన్న, మామిడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కురిసిన అకాల వర్షంతో వర్తక వ్యాపార వాణిజ్య సముదాయాలు నిలిచిపోయాయి.